Maharastra: మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి… బిందెలతో మహిళల ఆందోళన

-

మహారాష్ట్రలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. కొన్ని జిల్లాల్లో సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా నాందేడ్, నాసిక్, అహ్మద్ నగర్, ధూలే, అకోలా వంటి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తింది. ముఖ్యంగా నాసిక్ ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో నీరు దొరక్క ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. నాసిక్ లోని తిరద్ షెట్ గ్రామంలో నీటి ఎద్దడిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. 

నాసిక్ నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ గత 50 ఏళ్ల నుంచి మాకు నీటి సౌకర్యం లేదని..ఇక్కడి ప్రజలు ప్రతీ రోజు నీరు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బందుల పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిందెలతో మహిళలు నిరసన తెలిపారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజల్లో చాలా మంది రోజూవారీ కూలీలే ఉన్నారు. నీటి కోసం కూలి పనికి వెళ్లకుండా అల్లాడిపోతున్నారు. అయితే అధికారులు మాత్రం జల్ జీవన్ మిషన్ కింద జిల్లాలోని నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న గ్రామానలు గుర్తించామని.. నీటి సరఫరాకు సంబంధించి పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే పూర్తి చేస్తామని చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news