జగన్ పొలిటికల్ ఫుట్ బాల్ ఆడతారు..10 బాల్స్‌ను ఒకేసారి ఆడతారు – మాజీ మంత్రి

-

జగన్ పొలిటికల్ ఫుట్ బాల్ ఆడతారు..10 బాల్స్‌ను ఒకేసారి ఆడతారని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. లోకేష్ టూ టెన్ గాడని.. నువ్వు పనికి రాని దద్దమ్మవనే 420 గాడు హోటల్ ‌కు వెళ్ళి వేరే పార్టీ వాళ్ళ బూట్లు నాకుతున్నాడని ఎద్దేవా చేశారు.

అద్దం ముందు నిలబడి తన చేతులు ఊపుకుంటాడని.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు, కార్యక్రమాల మీద చర్చ జరక్కుండా వీళ్ళ కుట్రలు అని ఫైర్ అయ్యారు కొడాలి నాని. మేము మాట్లాడితే బూతులు తిడుతున్నామని బయటకు వస్తారని పేర్కొన్నారు.

జగన్ ఒకే ఆట ఆడతారు…పొలిటికల్ ఫుట్ బాల్ ఆడతారు.. పది బాల్స్‌ను ఒకేసారి ఆడతారు.. జగన్ ఫుట్ బాల్ ఆట దెబ్బకు చెట్టుకు ఒకరు పుట్టకొకరు అయ్యారని చురకలు అంటించారు. వీళ్ళకు ఇంకా సిగ్గు రాలేదని.. జగన్ సోషల్ ఇంజనీర్ అంటూ కొనియాడారు. నిన్న అవనిగడ్డలో జరిగిన మంచి పని పై చర్చ జరక్కుండా లోకేష్ సాయంత్రానికి పిల్లినా కొడుకు అంటూ వాగాడు.. చంద్రబాబు ఎంత మంది నో సర్వ నాశనం చేశాడని మండిపడ్డారు. అవనిగడ్డలో రైతులు రైతులు కాదా అని నిలదీశారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news