సీఎం జగన్ పిల్లి కాదు పులి – కొడాలి నాని

-

సీఎం జగన్ పబ్జి ఆడుతారంటూ నారా లోకేష్, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కి వచ్చిన ఒకే ఒక ఆట ఫుట్ బాల్ అని.. ఎంతమంది వచ్చినా గోల్ వేయగల మొనగాడని కౌంటర్ వేశారు. జగన్ పిల్లి కాదు.. పులి అని.. తేడా తెలియకుండా వెళితే ఆహారం అయిపోతారంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిన ఘనత చంద్రబాబు దేనిని కొడాలి నాని ఆరోపించారు.

వికేంద్రీకరణ నిర్ణయం పై పవన్ కళ్యాణ్ తో జగన్ ను చంద్రబాబు తిట్టీస్తున్నారని విమర్శించారు. లోకేష్ పనికిమాలిన వాడు కాబట్టే పక్క పార్టీలతో చంద్రబాబు తిట్టిస్తున్నాడని ఆరోపించారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. ముద్రగడ పద్మనాభాన్ని ఎలా అవమానించారో ప్రజలకు తెలుసన్నారు కొడాలి నాని. చంద్రబాబు చిన్నాచితక పార్టీల బూట్లు నాకే పరిస్థితి వచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news