జాలర్ల విషయంలో ప్రభుత్వం గాలి మాటలు చెబుతోంది : కొల్లు రవీంద్ర

-

గత శనివారం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్లను బోటులోని ఇంజన్‌లోకి నీరు వచ్చి చేరడంతో సముద్రంలో
చిక్కుకుపోయినట్లు సమాచారం అందించారు. అయితే అప్పటినుంచి వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు మెరైన్‌ పోలీసులు, నేవీ అధికారులు సైతం సర్చ్‌ ఆపరేషన్‌ను చేపట్టారు. అయితే.. గల్లంతైన మత్స్యకార కుటుంబాలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గల్లంతైన మత్స్యకారులను ఆచూకీ కోసం ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆయన ఆరోపించారు.

సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నామని.. హెలీకాప్టర్లు గాల్లో లేచాయంటూ ప్రభుత్వం గాలి మాటలు చెబుతోందంటూ ఆయన ఆరోపణలు గుప్పించారు. బందరులో కానీ.. అంతర్వేదిలో కానీ, కాకినాడలో కానీ సెర్చ్ ఆపరేషన్ జరగడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాల్లో సముద్రం వేటలో ఉన్న వాళ్లు తమకెక్కడా హెలీకాప్టర్లు కన్పించడం లేదంటున్నారని ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం కనీసం రేషన్ కూడా ఇవ్వలేదని, మత్స్యకారుల గల్లంతుపై సీఎం జగన్ వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version