కోమటిరెడ్డి బ్రదర్స్ ఎఫెక్ట్: నల్గొండలో డ్యామేజ్ ఎక్కువే!

-

ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లో పనిచేస్తూ వస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు రూట్ మార్చిన విషయం తెలిసిందే…ఉమ్మడి నల్గొండ జిల్లాలో బలమైన నాయకులుగా ఉన్న వీరు…ఇప్పుడు బీజేపీ బలాన్ని పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అలాగే మునుగోడు ఉపఎన్నికలో గెలవడానికి ట్రై చేస్తున్నారు.

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారమే కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది…ఈయన కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారు గాని..ఆ పార్టీని వీడటం లేదు. ఎంపీ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని బీజేపీలో చేరకుండా, కాంగ్రెస్ లో ఉంటూ…ఆ పార్టీపై విమర్శలు చేస్తూ…ఆ పార్టీకి డ్యామేజ్ పెంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే వీలు చూసుకుని వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఇలా కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపుకు వెళ్ళడం వల్ల…నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి భారీ డ్యామేజ్ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్స్ పార్టీ ఆధిక్యం ఎక్కువ ఉన్న జిల్లాలు నల్గొండ, ఖమ్మం జిల్లాలే…ఈ జిల్లాల్లో కూడా పార్ట్ వీక్ అయితే ఇంకా కాంగ్రెస్ పార్టీ పరిస్తితి ఘోరంగా తయారవుతుంది. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడేలా ఉంది. జిల్లాలో కొన్ని స్థానాల్లో గెలుపోటములని ప్రభావితం చేయగల సత్తా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఉంది.

మునుగోడు, నల్గొండ, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, భువనగిరి స్థానాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్ బీజేపీ వైపుకు వెళ్ళడం వల్ల..ఆ పార్టీ బలం పెరిగి..కాంగ్రెస్ బలం తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మునుగోడు ఉపఎన్నికలో గాని రాజగోపాల్ గెలిస్తే..ఇంకా నల్గొండ జిల్లాలో బీజేపీ బలం పెరుగుతుంది. మొత్తానికి చూసుకుంటే కోమటిరెడ్డి బ్రదర్స్ వల్ల నల్గొండలో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news