అభివృద్ధి కోసం పైసా ఇవ్వని కేసీఆర్‌ .. ఇప్పుడు మునుగోడు ప్రజల దగ్గరకే వచ్చాడు : రాజగోపాల్‌రెడ్డి

-

మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రత్యర్థులపై వాడివేడిగా విమర్శలు గుప్పిస్తున్నారు అభ్యర్థులు. అయితే.. తాజాగా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బీఆర్‌సీ ఫంక్షన్ హాల్ లో బీజేపీ ఆధ్వర్యంలో చేనేత సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ‌‌ కోసమే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక కుటుంబం చేతిలో బందీ అయ్యిందన్నారు రాజగోపాల్‌రెడ్డి. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి గురించి అడిగితే పైసా ఇవ్వని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు మునుగోడు ప్రజల దగ్గరకే వచ్చాడంటూ మండిపడ్డారు రాజగోపాల్‌రెడ్డి. సిరిసిల్లలో చేనేత కార్మికులకు ఏమీ చేయని మంత్రి కేటీఆర్.. మునుగోడులోని చేనేత ‌కార్మికులకు ఏం చేస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 2008లో చేనేత కార్మికుల ఆత్మహత్య ఘటనలు తనను కలచివేశాయని ఆవేదన వ్యక్తం చేశారు రాజగోపాల్‌రెడ్డి.

Komatireddy Rajagopal Reddy: రేవంత్‌ బ్లాక్‌ మెయిలర్‌.. ఆయనకు వ్యక్తిత్వం  లేదు: రాజగోపాల్‌రెడ్డి

రైతులకు ‌రుణాలు మాఫీ ‌చేసినప్పుడు చేనేత ‌కార్మికులకు ఎందుకు చేయరని ప్రశ్నించారు రాజగోపాల్‌రెడ్డి. గతంలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేయించిన తనకు వారితో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న 12మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడే ఇలాంటి పాలన వద్దని అనుకున్నానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, చేనేత నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news