దక్షిణ భారతదేశపు అతిపెద్ద గిరిజన జాతర మేడారం ఈ జాతర ని పురస్కరించుకుని అటవీ పర్యావరణ దేవదాయ శాఖ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రజలకి భక్తులకి శుభాకాంక్షలు ని తెలిపారు. మేడారం జాతర ఆదివాసి ఆత్మ గౌరవానికి అలానే తెలంగాణ సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీక అని అన్నారు. సమ్మక్క సారక్కల నామస్మరణతో యావత్ తెలంగాణలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని అన్నారు.
గిరిజన మహిళలు సమ్మక్క సారక్క లు విరోచిత పోరాటం చేసి వీరమరణం పొందిన తెలంగాణ ప్రజల గుండెల్లో సదా జీవించే ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొలువైన వెంటనే మేడారం జాతర నిర్వహించుకునే అవకాశం కలగడం అదృష్టం అని భావిస్తున్నాను అని అన్నారు. మేడారం మహా జాతర తెలంగాణ ఖ్యాతిని జాతర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ హోదా తేవడానికి కృషి చేస్తుందని కొండ సురేఖ అన్నారు.