కాంగ్రెస్ కి బుద్ధి చెప్పాలి: కొప్పుల ఈశ్వర్

-

రాష్ట్ర ప్రభుత్వం కారణంగా కర్షకులు ప్రాణాలను విడిచిపెడుతున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. పెద్దపల్లి మండలం లో వరి పొలాలని పరిశీలించరు. తర్వాత ఆయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పి రైతుల్ని ఆగం చేస్తున్నారని అన్నారు. ఎండిపోయిన పంటలకి రైతులకి ఎకరాకి 25వేల పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రైతులు మోసగించిన కాంగ్రెస్ కి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం కచ్చితంగా అన్నారు. రైతులు అన్నమో రామచంద్ర అంటుంటే ప్రభుత్వానికి కనికరం లేదని అన్నారు 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరాకి 15000 సహాయం రెండు లక్షల రుణమాఫీ చేయాలని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version