Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్. తనదైన యాంకరింగ్‌తో బుల్లి తెర యాంకర్ గా రాణిస్తూనే.. అవకాశం దొరికినప్పుడల్లా వెండి తెరపై తన అందాలను ఆరబోస్తుంటుంది. గ్లామర్ విషయంలో స్టార్ హీరోయిన్లలకు ఏ మాత్రం తగ్గకుండా పోటీ పడుతుంది. ఇక సోషల్ మీడియాలో ఈ హట్ యాంకర్ చేసే రచ్చ మాములుగా ఉండదు. తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు మత్తెక్కిస్తోంది.
అయితే.. ఆమె డ్రెస్సింగ్‌పై.. చాలా రోజులుగా విమర్శలు వస్తునే ఉన్నాయి. ఇద్దరు పిల్లల తల్లి అయ్యి ఉండి.. ఏంటీ ఈ బట్టలు.. ఆ ఎక్స్ పోజేంటీ అంటూ నెట్టింట్లో ట్రోల్స్ చేస్తునే ఉన్నారు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్ పై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అనసూయ మంచి డ్యాన్సరే కాక మంచి నటి అని, అయితే ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్ చేశారు.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా జనాలు చూస్తారు. అందుకే అలాంటి బట్టలు వేసుకోవాల్సిన పనిలేదు. ఆమె చక్కటి నటి. కానీ ఆమె డ్రెస్సింగ్ నాకు నచ్చదు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుంది అని పేర్కొన్నారు. ప్రస్తుతం కోట చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరలవుతుంది.
ఈ వ్యాఖ్యలపై హాట్ యాంకరమ్మ అనసూయ కాస్త ఘాటుగానే స్పందించింది. ఇక్కడ అనసూయ ఆయన పేరు ఎక్కడ చెప్పుకుండా.. ఓ సీనియర్ నటుడు తన డ్రెసింగ్ పై కామెంట్స్ చేసారు.
ఆయనకు తెలియదు అనుకుంటా.. ఈ వృత్తిలో హీరోయిన్స్‌తో పాటు ఇతర నటీనటులు కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటారు.
మరోవైపు ఆ నటుడు నటించిన ఎన్నో సినిమాల్లో స్త్రీలను కించ పరిచే సన్నివేశాలుండటంతో పాటు.. ఆయన అందులో నటించారు కూడా. హీరోలు షర్ట్ తీసి కండలు చూపిస్తూ.. హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తుంటే మాత్రం ఎందుకు ఏమీ అనరని.. ఎవరూ ఎందుకు ప్రశ్నించింది. నటనలో భాగంగా ఆయన అలా చేసారు. నేను కూడా అలానే చేసానని గట్టిగా కౌంటర్ ఇచ్చింది అనసూయ.