తెలంగాణలో మొదటి డోస్ వంద శాతం పూర్తయిన సందర్భంగా.. కోఠి కోవిడ్ కంట్రోల్ రూమ్ లో కేక్ కట్ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు..మట్లాడుతూ… 15-18 వయసున్న వాళ్లకు జనవరి 3 నుంచి వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు. దీని కోసం ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని సూచనలు చేశారు.
డాక్టర్ అందుబాటులో ఉండే చోట వాక్సిన్..ఇస్తామని.. 2007 , దానికంటే ముందు జన్మించిన వాళ్ళు వాక్సిన్ వేసుకోవచ్చన్నారు. పిల్లలందరికీ కోవాగ్జిన్ టీకా ఇవ్వనున్నామని ప్రకటన చేశారు. తెలంగాణా 60 ఏళ్ళు పై బడిన వాళ్లందరికీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ లో మొదటి డోస్ వంద శాతం పూర్తి చేసుకోవటం ఆనందంగా ఉందని.. పెద్ద రాష్ట్రాల్లో అన్నింటికంటే ముందుగా వందశాతం పూర్తి చేసుకుందని వెల్లడించారు. వైద్యశాఖ సిబ్బంది కృషికి నిదర్శనమన్నారు. వైద్య శాఖ సిబ్బంది రాత్రనక, పగలనక కష్టపడ్డారని… తెలంగాణ లో 2 కోట్ల 77 లక్షల 67 వేల మంది కి వాక్సిన్ వేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. అందరికి మొదటి డోస్ 100 శాతం పూర్తి అయిందన్నారు.