THE WARRIOR : “విజిల్ మహాలక్ష్మి’ గా కృతి శెట్టి..

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్‌ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. స్టైలిష్ గా కనిపిస్తూనే… మాస్ పాత్రలతో అలరించే హీరో రామ్ పోతినేని. దర్శకుడు లింగుస్వామి కూడా సినిమాలకు పెట్టింది పేరు. ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ది వారియర్‌ అనే టైటిల్‌ ను ఇటీవలే అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. అయితే… ఈ సినిమాలో ఉప్పెన తో ఆకట్టుకున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఊర మాస్ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది సినీ బృందం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి కృతి శెట్టి ఫస్ట్‌ లుక్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. విజిల్‌ మహాలక్ష్మి అనే క్యారెక్టర్‌ లో కృతి శెట్టి నటిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్టు లుక్‌ ను విడుదల చేశారు. స్కూటీపై కృతి శెట్టి కూర్చిని.. అందరినీ ఈ లుక్‌ తో ఆకట్టుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Latest news