ఆ స్టార్ హీరో మూవీ నుంచి కృతి శెట్టి అవుట్..!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి శెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. అనంతరం వరుస అవకాశాలు అందుకొచ్చుకొని దూసుకుపోతుంది. తాజాగా కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య సినిమాలో ఈ భామ నటించినుందని వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంచి కృతి శెట్టి ని తప్పించి వేరే హీరోయిన్ ను తీసుకొని తెలుస్తుంది.

టాలీవుడ్ హీరోయిన్ కృతిశెట్టి తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కు జంటగా కృతి నటించిన ఉప్పెన సినిమా ఘనవిజయాన్ని అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఈ విజయంతో ఈ భామకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు వంటి చిత్రాల్లో నటించింది. అనంతరం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

అయితే తాజాగా ఈ భామ కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య సినిమాలో అవకాశాన్ని అందుపుచ్చుకుంది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కొన్ని రోజులు వాయిదా పడింది. అనంతరం జరిగిన మార్పులతో కృతి శెట్టిని ఈ సినిమా నుంచి తప్పించనున్నట్టు తెలుస్తోంది.

కోలీవుడ్ రియలెస్టిక్ దర్శకుడు బాల సూర్యతో తీయనున్న ఈ సినిమాకు వనన్‌గాన్ అనే టైటిల్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. అనంతరం హీరో సూర్య, దర్శకుడు మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో ఈ సినిమాలో అరుణ్ విజయ్ నటించిన ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కృతి శెట్టి స్థానంలో తమిళ, కన్నడ భాషల్లో మంచి పేరు సంపాదించుకున్న రోష్ని ప్రకాష్ ను హీరోయిన్గా తీసుకొని ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాను సూర్య సొంత బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించనున్నట్టు కూడా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version