2021-2026 మధ్య గల ఐటీ పాలసీ ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భం గా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దేశం లో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పడు ఉన్న GSDP ఇప్పుడు దాదాపు డబుల్ అయ్యిందన్నారు. ప్రపంచంలోని టాప్ 5 టెక్ కంపెనీలు హైదరాబాద్ లో సెంటర్ లు ఏర్పాటు చేసాయని.. గడిచిన 5 ఏళ్ళలో ఎన్నో MNC కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని పేర్కొన్నారు.
తెలంగాణ లో ఈ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఆదివారం కూడా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవచ్చని.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పడు …ఇంటలిజెన్ట్ టెక్నాలజీ అని స్పష్టం చేశారు. పేపర్ లెస్..మ్యాన్ లెస్ గవర్నెన్స్ అందిస్తామని.. 13 వందల కోట్ల రూపాయలతో స్టార్ట్ అప్ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించ్చారు మంత్రి కేటీఆర్. రెండవ , మూడవ శ్రేణి నగరాల్లో కూడా కార్యకలాపాలు ప్రారంభించాలని ఐటి కంపెనీలను కోరుతున్నామన్నారు