‘నష్టాలు జాతికి.. లాభాలు దోస్తులకు’.. ఇదే మోదీ విధానం : కేటీఆర్

-

నష్టాలను జాతికి అంకితం చేసి లాభాలను దోస్తులకు అంకితం చేయటం మోదీ విధానమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బైలాదిల్లా అనేది 1.34 బిలియన్‌ టన్నుల ఐరన్ ఓర్‌ లభించే గని అని తెలిపారు. విశాఖ ఉక్కుకు, బయ్యారం గనులకు ఒక సంబంధం ఉందని చెప్పారు. బైలాదిల్లా గని బయ్యారానికి 160 కి.మీ. దూరంలోనే ఉందన్న మంత్రి.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలోనే ఉందని వెల్లడించారు.

‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉక్కు పరిశ్రమలు పెడతామని కేంద్రం చెప్పింది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ప్రధానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం. బైలాదిల్లా నుంచి బయ్యారానికి 50శాతం పైపులైన్‌ ఖర్చు భరిస్తామని చెప్పాం. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తే యువతకు ఉద్యోగాలు లేకుండా పోతాయి. ఎల్‌ఐసీ ద్వారానే రైతుబీమాలు చేయించిన పాలకుడు సీఎం కేసీఆర్‌. ప్రభుత్వ సంస్థలు బతికుంటేనే జాతికి మంచి జరుగుతుందని నమ్మే వ్యక్తి కేసీఆర్.’ – కేటీఆర్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి

Read more RELATED
Recommended to you

Exit mobile version