BJP అంటే EC,CBI, NIA, IT, ED – మంత్రి కేటీఆర్ సెటైర్

-

బీజేపీ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఓ రేంజ్‌ లో సెటైర్లు పేల్చారు. బీజేపీ అంటే… EC,CBI, NIA, IT, ED అని చురకలు అంటించారు. తెలంగాణలో బీజేపీ లక్ష్యంగా కొత్తగా తెలంగాణలో బీజేపీ బలోపేతం బాధ్యతని తీసుకున్న సునీల్ బన్సాల్ పనిచేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే నిన్న మునుగోడు ఉప ఎన్నికపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

అక్టోబర్‌ 15లోపు ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ వస్తుందని.. అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. అయితే..ఆయన వ్యాఖ్యలకు తాజాగా కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ అంటే… EC,CBI, NIA, IT, ED అని చురకలు అంటించారు. ఎన్నికల కమిషన్‌ కంటే ముందే.. బీజేపీ వాళ్లు ఎన్నికల తేదీలను, సీబీఐ కంటే ముందే.. అరెస్ట్‌ చేస్తామని బెదిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈడీ కంటే ముందే దాడులు జరుగుతాయని బీజేపీ నాయకులే చెబుతారని.. ఇక బీజేపీ EC,CBI, NIA, IT, ED అని పిలవాలని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version