సంక్రాంతి తర్వాత మీడియా అకాడమీ బిల్డింగ్ ప్రారంభం చేస్తున్నామని ప్రకటన చేశారు మంత్రి కేటీఆర్. మీడియా ఇన్ తెలంగాణ పాస్ట్, ప్రెసెంట్ ఫ్యూచర్ అంశం పై రెండు రోజుల జాతీయ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తి కర కామెంట్స్ చేశారు. వారసత్వం అనేది ఎంట్రీ కార్డ్ మాత్రమే…తరవాత మన సమర్థతే మనల్ని నిలబెడుతుందని…. మీడియా కంటే కూడా మీడియా లో పనిచేసిన కలం వీరుల పనితనం గొప్పదని చెప్పారు.
నిజాం కాలం లో షోయబ్ ఉల్లాఖన్, గోల్కొండ పత్రిక నడిపిన సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరులతో నైతిక బలం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం లో TRS పార్టీ పెట్టిన సమయం లో మాకు డబ్బు సపోర్ట్, మీడియా సపోర్ట్ లేదని… దేశం లో NDA ,రాష్ట్రం లో టిడిపి ఉన్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల అప్పుడే వస్తున్న సమయం అన్నారు. NTR పార్టీ పెట్టినప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేదని… కెసిఆర్ పార్టీ పెట్టిన సమయం లో మీడియా యాజమాన్యం సపోర్ట్ లేదని వెల్లడించారు. కానీ మీడియా లో ఉన్న జర్నలిస్టులే మాకు సపోర్ట్ గా నిలబడ్డారని గుర్తు చేశారు. అప్పుడు మాకు సపోర్ట్ గా నిలిచిన చాలా మంది జర్నలిస్టులను సముచిత స్థానం ఇచ్చి గౌరవించుకున్నామని…దేశంలో ఎక్కడ లేని జర్నలిస్ట్ సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం సొంతం అన్నారు కేటీఆర్.
Minister @KTRTRS speaking at the National Seminar on 'Media in Telangana: Past, Present and Future', at Dr B.R. Ambedkar Open University. https://t.co/CwFNWYwzZj
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) November 12, 2022