కారులో లీడింగ్..కేటీఆర్ కవర్ చేసేస్తున్నారుగా!

-

కారు పార్టీలో లీడింగ్ అంతా కేటీఆర్‌దే అని చెప్పొచ్చు…మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే..మరోవైపు పార్టీకి కాబోయే అధినాయకుడుగా బాధ్యతలు చేపడుతున్నట్లు కనిపిస్తున్నారు. కారు పార్టీ అధినాయకుడుగా, సీఎంగా కేసీఆర్ ఉన్నారు..అయితే ఈయన ఏదో కొన్నిరోజులు మాత్రమే ఫుల్ గా రాజకీయాలు చేసి..తర్వాత సైలెంట్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు..దీంతో పార్టీలో లీడింగ్ కేటీఆర్ తీసుకుంటున్నారు…మొత్తం ఆయనే నడిపిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఎలాగో భవిష్యత్ లో టీఆర్ఎస్ పగ్గాలు చేపట్టేది కేటీఆర్ అనే సంగతి అందరికీ తెలిసిందే…అందుకే ఇప్పటినుంచే ఆయన దూకుడుగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎలాగో మంత్రిగా కేటీఆర్ దూకుడుగా ఉన్నారు…అదే సమయంలో రాజకీయంగా కూడా కేటీఆర్ దూకుడుతో ముందుకెళుతున్నారు. బలపడుతున్న ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తిరుగులేదనే పొజిషన్…కానీ ఊహించని విధంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫామ్ లోకి వచ్చేశాయి. ఎలాగైనా టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి అధికారం దక్కించుకోవాలని రెండు పార్టీలు చూస్తున్నాయి.

అయితే బలంగా ఉన్న పార్టీలకు చెక్ పెట్టడానికి కేసీఆర్ గట్టిగానే కష్టపడుతున్నారు..కాకపోతే ఒకోసారి ఆయన రెస్ట్ మోడ్ లోకి వెళుతున్నారు..దీంతో కేటీఆర్ తెరపైకి వచ్చి..కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టడానికి చూస్తున్నారు..ఆ రెండు పార్టీలు చేసే విమర్శలకు కౌంటర్లు ఇస్తూనే..ఆ రెండు పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

తాజాగా కేసీఆర్ పై వచ్చిన ఆరోపణలని తిప్పికొడుతూ.. తన తండ్రి కేసీఆర్‌ పుట్టుకతోనే భూస్వామి అని, ఆయన చింతమడకలోనే పుట్టారని, అప్పటికే రెండెకరాల స్థలంలో ఇల్లు కూడా ఉందని, తన తండ్రి పొలంలో ఇల్లు కట్టుకుంటే ఫాంహౌస్ ముఖ్యమంత్రి అంటారా అంటూ ఫైర్ అయ్యారు. అలాగే ఓటుకు నోటు కేసుని ప్రస్తావించి రేవంత్ రెడ్డికి, కర్ణాటక సీఎం సీటుకు రూ.2500 కోట్లు అంటూ బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. ఈ విధంగా కేటీఆర్ కారులో లీడ్ తీసుకుని, అన్నీ కవర్ చేసేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version