యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. సోమవారం ప్రారంభమైన మహాకుంభ్.. తొలిరోజే 1.50 లక్షల మంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. 45 రోజుల పాటు కొనసాగనున్న మహా కుంభమేళాకు 40 కోట్ల మంది భక్తులు వస్తాయని యూపీ సర్కార్ అంచనా వేసింది. కానీ, తొలిరోజే భారీగా భక్తులు విచ్చేయడంతో ఆ సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.
ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీగా విదేశీయులు భాగస్వాములవుతున్నారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎక్కువ మంది విదేశీ భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తున్నారు. విదేశీ భక్తులు ప్రస్తుతం కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. విదేశీయులు ‘కాలభైరవ’అష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పఠిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.