ఛీ..ఛీ..వీళ్ళు అసలు పోలీసులా..మహిళను బలవంతంగా..

-

ఏపీలో రోజు రోజుకు క్రైమ్ రేటు పెరిగి పోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఏదైనా కష్టం వస్తే పోలీసుల దగ్గరకు వెళతారు. కానీ, పోలీసులే సాదారణ ప్రజల పై రుబాబు చూపిస్తే ఎక్కడికి వెళతారు.ఎవరితో మొరపెట్టుకుంటారు.. ఇలాంటి ఘటనలు రోజుకోకటి వెలుగు చూస్తున్న కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి పొయారని ఒకవైపు ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. అయినా దారుణాలు తగ్గడం లేదు..

కాగా, తాజాగా ఒక అవమానీకర ఘటన వెలుగులోకి వచ్చింది. కష్టం వచ్చిందని పోలీసులను ఓ మహిళ సాయం కోరింది. సాయం చెయ్యడం మాట పక్కన పెడితే..పోలీసులు సదరు అధికారులకు వత్తాసు పాడటం సిగ్గుచేటు.ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసలు విషయాన్నికొస్తే..తమ ఇంటి ముందు స్థలాన్ని ప్రభుత్వ అధికారులు స్వాధీనం చేసుకోవాడాన్ని అడ్డుకున్న తల్లీకూతుళ్లపై పోలీసులు దారుణంగా ప్రవర్తించారు.
ఈ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది.గూడూరు మండలం గడిపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

మీనాక్షమ్మ ఇంటి ముందు ఉన్న స్థలాన్ని కాలీ చేయాలని రెవెన్యూ సిబ్బంది జేసీబీతో అక్కడున్న కట్టెలను తొలగించే ప్రయత్నం చేశారు.ఈ స్థలం తమదేనని 50 ఏళ్ళుగా కట్టేలు వేసుకుంటున్నామని అన్యాయంగా లాక్కోకండి సారూ.. అంటూ మీనాక్షమ్మ ప్రాధేయపడింది. అయిన అధికారులు కనికరించక పోవడంతో ఆమె ఒంటిపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీన్ని వెంటనే అధికారులు అడ్డుకుని ఆమెను పక్కకు తీసుకువెళ్ళారు. అడ్డువచ్చిన మీనాక్షమ్మ కుమార్తెలను మహిళా పోలీసులు చున్నీలతో కట్టి స్థలం వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు.ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు.. చివరికి ఆ స్థలం ఖాళీ చేశాక వారిని వదిలిపెట్టారు..ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news