దివంగత వైఎస్సార్ ఆత్మగా పిలవబడే సీనియర్ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు..జగన్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. మొదట నుంచి పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపైనే ఫైట్ చేస్తున్న కేవీపీ..గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక కేవీపీ సైలెంట్ అయ్యారు. తన సన్నిహితుడు వైఎస్సార్ కుమారుడు కావడంతో జగన్‌పై పెద్ద స్థాయిలో విమర్శలు చేయలేదు.
కానీ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతుంది..ఇప్పటికీ పోలవరం పూర్తి కాలేదు. అది ఎంత శాతం అయిందో క్లారిటీ లేదు. అటు భూ నిర్వాసితులని ఆదుకోలేదు. దీంతో కేవీపీ సైతం గళం విప్పాల్సిన పరిస్తితి వచ్చింది. పోలవరం నిర్వాసితులుగా ఉన్న నాలుగున్నర లక్షల మందికి దారి చూపలేని దీన, హీనస్థితిలో సీఎం జగన్ పాలన ఉందని మండిపడ్డారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ కూడా కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని, బీజేపీతో సఖ్యత కోసం చూస్తున్నారని విమర్శించారు. ఇక పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర విభజన చట్టం మేరకు కేంద్రమే నిర్మించాలని, పోలవరం నిర్వాసితులు నాలుగున్నర లక్షల మందికి జగన్ దారి చూపడం లేదని, కనీసం వారికి ప్యాకేజ్ అందించలేని హీన, దీనస్థితిలో ఉన్నారని ఫైర్ అయ్యారు. అయితే ఇంతకాలం కేవీపీ…జగన్‌ని పెద్దగా టార్గెట్ చేయలేదు. ఇప్పుడు కాస్త దూకుడుగా విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
మరి జగన్ ప్రభుత్వం విషయంలో అసంతృప్తి ఉండి ఇలా చేస్తున్నారా? అనేది క్లారిటీ లేదు. మొత్తానికైతే జగన్‌ని టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు. అయితే కేవీపీ..బాబుని కూడా వదలడం లేదు..బాబుపై కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శలు చేస్తున్నారు.