ఎన్టీఆర్ పేరెత్తడానికి సిగ్గు లజ్జ లేని వీళ్ళకు అర్హత లేదు : లక్ష్మీ పార్వతి

-

ఎన్టీఆర్ మరణానంతరం విజ్ఞాన్ ట్రస్టు స్ధాపించి ఎన్టీఆర్ అవార్డులు ఇచ్చానని తెలిపారు తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు దేవినేని నెహ్రూ అత్యంత ఇష్టమైన వ్యక్తి అని, ఎన్టీఆర్ పేరెత్తడానికి సిగ్గు లజ్జ లేని వీళ్ళకు అర్హత లేదని మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘ఎన్టీఆర్ సంతానం అమాయకులు, అజ్ఞానులు. ఎలక్షన్లు వచ్చినపుడే వీళ్ళకు ఎన్టీఆర్ గుర్తుకొస్తారు. నేను బ్రతికి ఉండకపోతే ఎప్పుడో ఎన్టీఆర్ ఫోటో తీసేసేవాళ్ళు. బావగారి కళ్ళల్లో సంతోషం చూడటానికి బాలకృష్ణ పని చేస్తున్నాడు. వాళ్ళది కృత్రిమ ప్రేమ అని ప్రజలకు అర్ధమైపోయింది. చంద్రబాబు కు ఉన్నది అధికార కాంక్ష మాత్రమే. జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ చరిష్మా ఉంది.. ఆయన పోలీకలున్నాయి.. జూనియర్ గురించి విన్నాక చంద్రబాబు కి తన కొడుకు లోకేష్ గుర్తొచ్చాడు…

What did Lakshmi Parvathi speak to NTR 'Aatma'?

హరికృష్ణ కు జరిగిన అవమానం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ములు దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న అనేది ఒక మహానాడు తీర్మానం.. ఆ తరువాత చంద్రబాబు చెత్తబుట్టలో వేస్తాడు.. ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం చేయడానికి నాకే అర్హత ఉంది. అవసరమైతే కాళ్ళు లేకపోతే జుట్టు విధానం చంద్రబాబు ది.. మీ యుగపురుషుడినే కదా దారుణంగా అవమనించారు. ఎన్టీఆర్ సింహ గర్జనలో దేవినేని నెహ్రూ కృషి అద్భుతం. టీడీపీ పార్టీ ఆవిర్భావ సమయానికి చంద్రబాబు కాంగ్రెస్ లో ఉన్నాడు. రామోజీరావు, చంద్రబాబు కలిసి అన్యాయం చేసారు అని ఎన్టీఆర్ బాధపడ్డారు. మరణానికి ముందు ఎన్టీఆర్ తన ఆవేదన దేవినేని నెహ్రూ కు చెప్పుకున్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన జగన్ గొప్పవారు.. ఎన్టీఆర్ ఆశయాలు నీరుగార్చాడు చంద్రబాబు.. లిక్కర్ లాబీ దగ్గర కోట్లు తీసుకుని మద్య నిషేధాన్ని నీరుగార్చాడు. ఎన్టీఆర్ ఆశయాలు నీరుగార్చిన చంద్రబాబు టిడిపి కి వారసుడు ఎలా అవుతాడు.’ అని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news