ఒలింపిక్స్ : అదరగొట్టిన లక్ష్య సేన్..!

-

బ్యాట్మెంటన్ లో సాత్విక్, చిరాగ్ జోడీ ఓడిన బాధలో ఉన్న భారత ఫ్యాన్స్ కు లక్ష్య సేన్ కొంత ఆనందాన్ని కలిగించాడు అనే చెప్పాలి. రౌండ్ 16 లో అద్భుతం ప్రదర్శన కనబర్చిన లక్ష్య సేన్ క్వాటర్ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. లక్ష్య సేన్ రౌండ్ 16 లో ఓడించిన ప్లేయర్ కూడా భారత్ కు చెందినవాడే.

ఇండియాకు చెందిన మరో ప్లేయర్ అయిన HS ప్రణయ్ మరియు లక్ష్య సేన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో 21-12, 21-6 తేడాతో సునాయాస విజయం అందుకున్నాడు లక్ష్య సేన్. ఇక తన తర్వాతి మ్యాచ్ లో చైనీస్ తైపేకి చెందిన ప్లేయర్ తో లక్ష్య సేన్ ఆడనున్నాడు. ఇందులో గనుక విజయం సాధిస్తే సెమీ ఫైనల్స్ లోకి ఎంట్రీ ఇస్తాడు లక్ష్య సేన్. అయితే బ్యాట్మెంటన్ లో ప్రస్తుతం మెడల్స్ ఆగ్స్లు ఉన్న వారిలో లక్ష్య సేన్ ఒకడుఁ కావడంతో అతను క్వాటర్ ఫైనల్స్ లో ఎలా రాణిస్తాడు అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version