అమ్మో : మూడు రోజుల పాటు చెట్ల పొదల్లో గడిపిన లారా ?

-

నాలుగు రోజుల క్రితం అర్ధ రాత్రి సమయంలో పేరెంట్స్ మందలించారని ఇంటి నుండి వెళ్లిపోయిన లారా మిస్సింగ్ మిస్టరీ వీడింది. అయితే లారా కోసం 7 బృందాలుగా హయత్ నగర్ పోలీస్ లు, 30 – 40 మంది యువకులు బైక్ ల మీద గాలించినా ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే నాలుగు రోజులుగా ఇంటికి సమీపంలోని చెట్ల పొదల్లోనే లారా గడిపిందని లారా తల్లి అపర్ణ మీడియాకి తెలిపారు. జంతువులు అంటే లారాకు భయం లేదని, అందుకే చెట్ల పొదల్లో గడిపిందని అన్నారు.

మాది జంతుప్రేమికుల కుటుంబమని అయితే నాలుగు రోజులుగా కనీసం మంచి నీళ్ళు కూడా తీసుకోకపోవడం తో నీరసం అయిపొయింది అని అన్నారు. దీంతో నీటి కోసం దగ్గరలోని గుడిసె వద్దకు వెళ్ళిందని ఆమె అన్నారు. వాళ్ళు లారాను ఇంటికి తీసుకు వచ్చారని ఆమె అన్నారు. మొబైల్ లో చాటింగ్ చేయొద్దు, గేమ్స్ ఆడొద్దు అని పేరెంట్స్ చెబితే అది పిల్లల మంచికే అని గుర్తించాలని అపర్ణ పేర్కొన్నారు. మా పాప క్షేమంగా ఇంటికి చేరడం మా జీవితం లో మరిచిపోలేని రోజని ఆమె చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news