లావణ్య డ్రగ్స్ కేస్ లో ట్విస్ట్..!

-

లావణ్య డ్రగ్స్ కేస్ లో ట్విస్ట్. లావణ్య తో పాటుగా ఉనీత్ రెడ్డి, ఇందిరా మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. పోలీసులు సమాచారం ప్రకారం ఉనీత్ రెడ్డి, ఇందిరా పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళు ముగ్గురు కలిసి డ్రగ్స్ సేవించి, డ్రగ్స్ ను అమ్మేవారు అని పోలీసులు చెప్తున్నారు. అలానే లావణ్య, ఇందిరా కలిసి డ్రగ్స్ కస్టమర్లకు డ్రగ్స్ అమ్మేవారట.

ఒక గ్రామ పౌడర్ ను 6 వేలకు అమ్ముతున్నారు ఈ బ్యాచ్. బెంగుళూరు నుండి ఒక్కో గ్రామును 1500 కి ఉనీత్ రెడ్డి తీసుకు రావడం జరిగింది. పరారీలో ఉన్న ఉనీత్ రెడ్డి, ఇందిరా కోసం గాలింపు మొదలు పెట్టారు. లావణ్య, ఉనీత్ రెడ్డి పలు షార్ట్ ఫిల్మ్ లో కలిసి నటించారు. రాజ్ కిరణ్ దగ్గర లావణ్య మ్యూజిక్ నేర్చుకుంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version