అదే జోష్, అదే ఊపు..‘హనుమాన్ జంక్షన్’ పాటకు చిందేసిన లయ..

-

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లయ..చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగుతో పాటు పలు భాషలలో దాదాపుగా టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది. కూచిపూడి డ్యాన్సర్ అయిన లయ..2006 లో గణేష్ గోరటి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత సినిమాలకు దూరమైంది.

నటి లయ…సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ నటి..షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

తెలుగు ప్రేక్షకులకు చివరగా రవి తేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో కనిపించిన లయ..తాజాగా షేర్ చేసిన వీడియోలో..చక్కగా డ్యాన్స్ చేసింది. సూపర్ హిట్ ఫిల్మ్ ‘హనుమాన్ జంక్షన్’లోని ‘కిలకిలమని కలికి చిలక’ పాటకు గ్రేస్ ఫుల్ స్టె్ప్స్ వేసింది. సరకొతతో కలిసి లయ..జగపతి బాబు, అర్జున్ ల పాటకు ఆనాడు ఎలాగైతే స్టెప్పులేసిందో…అదే మాదిరిగా..అదే జోష్, ఊపుతో స్టెప్పులే సింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు..‘లయ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిందే’ అని డిమాండ్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version