హద్దులు దాటిన నేతలు…ఆ మాటలే గెలిపిస్తాయా?

-

రాజకీయాల్లో ఎప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రతిపక్షాలు ఎప్పుడు అధికార పక్షంపై విమర్శలు చేయడం సహజం. అలాగే ఆ విమర్శలకు అధికార పార్టీ నేతల నుంచి కౌంటర్లు రావడం కూడా అంతే సహజం. కాకపోతే ఈ విమర్శలు అనేవి నిర్మాణాత్మకంగా ఉండాలి. అలా కాకుండా మాటలు హద్దు దాటితే అవి చాలా దూరం వెళ్లిపోతాయి. ప్రజలు సైతం అలాంటి మాటలు అంగీకరించే పరిస్తితి ఉండదు.

గతంలో చంద్రబాబు, వైఎస్సార్‌లు ప్రత్యర్ధులుగా ఉన్నప్పుడు, విమర్శలు హద్దుల్లో ఉండేవి. కానీ ఇప్పుడు జగన్-చంద్రబాబు ప్రత్యర్ధులుగా ఉన్నారు. ఇక ఇప్పుడు నేతల మాటలు ఎలా ఉన్నాయో అంతా చూస్తూనే ఉన్నారు. 2014-2019 వరకు ఏపీలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలాంటి విమర్శలు కాస్త తక్కువగానే వచ్చాయి. కానీ ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటినుంచి పరిస్తితి మారిపోయింది.

ఎప్పటిలాగానే ప్రతిపక్ష పాత్రలో ఉన్న టీడీపీ, అధికార వైసీపీ, జగన్‌పై విమర్శలు చేస్తూ ఉంది. ఆ విమర్శలకు కౌంటర్లు ఇచ్చే ప్రయత్నంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు కొందరు హద్దులు దాటి మాట్లాడేశారనే విమర్శలు వచ్చాయి. ఒకానొక సందర్భంలో పరుష పదజాలంతో నేతలు దూషణలకు దిగారు. అయితే వైసీపీ నేతలు మాట్లాడుతుంటే, టీడీపీ నేతలు కూడా అదే పంథాలో వెళుతున్నారని తెలుస్తోంది.

ఆఖరికి నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం, ఈ మధ్య నోరు జారుతున్నారని, ఆయన కూడా నిర్మాణాత్మమైన విమర్శలు చేయడం తగ్గించేసి, నోటికి పనిచెబుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే నారా లోకేష్ సైతం పరుష పదజాలం వాడుతున్నారని, ఇక టీడీపీ నేతలు అదే బాటలో ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ నేతలుగా గురించి అయితే చెప్పాల్సిన పని లేదని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఇలా దారుణంగా విమర్శించుకోవడాన్ని ప్రజలు ఎప్పటికైనా తిరస్కరిస్తారని, అలాంటి నాయకులకు ఎన్నికల సమయంలో బుద్ధి చెబుతారని, రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news