జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కష్టాల నుండి కూడా బయట పడి జీవితాన్ని మార్చుకోవడం చాలా ముఖ్యం. అయితే అది ఎక్కడో లేదు మన చేతుల్లోనే ఉంది. మొదట్లో పూనమ్ చాలా ఇబ్బందులు పడ్డారు. తన అత్తమామలు మరియు భర్త కూడా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని రెండు నెలల పాటు చిత్రహింసలు పెట్టారు. అయితే బాగా కొట్టడం, చిత్రహింసలు పెట్టడం వలన నలిగిపోయారామె. తన ఒళ్ళు మొత్తం చచ్చు పడిపోయింది. ఆమె తిరిగి మళ్లీ నడవలేదని కూడా డాక్టర్లు చెప్పేశారు.
ఫిజియోథెరపీ వ్యాయామాల వల్ల మెల్లగా ఆమె తిరిగి కోలుకున్నారు. ఆమెకు ఎంతో సపోర్ట్ చేసే తన తండ్రి 2014లో చనిపోయారు. అప్పటినుండి కూడా ఆమె తన సొంత కాళ్ళ పైన నిలబడాల్సి వచ్చింది. తన తండ్రి చనిపోయిన తరువాత ఆమె బిందేశ్వర్ రాయ్ ఫౌండేషన్ ని స్థాపించారు. ఆమె బనారస్ హిందూ యూనివర్సిటీ లో పెయింటింగ్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఎంతో మంది పిల్లలకి ఆమె ఇప్పుడు పెయింటింగ్ మరియు టైక్వాండో నేర్పిస్తున్నారు.
ఆమెకి పెళ్లి అయిన తర్వాత 22 ఏళ్ల వయసులో బాల్కనీ నుండి కిందకు తోసేశారు అత్తమామలు. దీనితో ఆమె కోమాలోకి వెళ్లిపోయారు. కానీ మెల్లిగా ఆమె కోలుకున్నారు. వారణాసి టైక్వాండో అసోసియేషన్ తో ఈమె కలిసి చిన్నపిల్లలకి మరియు మహిళలకి టైక్వాండో నేర్పిస్తున్నారు. ఎన్జీవో తరఫున మూడు వేల మంది పిల్లలకి టైక్వాండో నేర్పించారు వాళ్లలో 20 మంది స్టేట్ మరియు నేషనల్ లెవెల్స్ టోర్నమెంట్ కూడా వెళ్లారు.
జీవితం ఎంత దారుణంగా ఉన్నా దానిని అందంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది అని ఈమె నిరూపించారు. ఎన్నో కష్టాలు అనుభవించిన ఆమె ఇప్పుడు సేవ చేస్తూ మంచి గుర్తింపు పొందారు. ప్రధాని నరేంద్ర మోడీ లాంటి ఎందరో నాయకుల్ని ఆమె ఇన్స్పైర్ చేస్తున్నారు. 2018 లో ఆమె ప్రధాని నరేంద్ర మోడీ కి పెయింట్ వేసి ఇవ్వడం జరిగింది.
”ఆమె ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా… ఎంతగానో జీవితంలో నలిగిపోయినా… తిరిగి మళ్లీ ఆమె జ్వాలలా లేచారు ఎంతోమంది ఆడవాళ్ళకి ఆమె స్ఫూర్తిగా నిలిచారు”.