తెలంగాణ శాసన మండలి ఇవాళ పలు బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో ముఖ్యంగా FRBM పరిధి పెంపు బిల్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య, మార్కెట్ కమిటీ సభ్యుల పదవి కాలం బిల్లులకు తెలంగాణ శాసన మండలి ఆమోద ముద్ర వేసింది. FRBM పరిధి 4 నుండి 5 శాతానికి పెంచే చట్టసవరణ బిల్లుకు తెలంగాణ శాసన మండలి ఆమోదం తెలపగా… వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల సంఖ్య 8 నుంచి 12కి పెంచుతూ చట్టసవరణ బిల్లుకు మండలి ఆమోదించింది.మార్కెట్ కమిటీ సభ్యుల పదవి కాలం ఏడాది నుండి రెండేళ్లకు పెంచుతూ బిల్లుకు మండలి ఆమోదం తెలిపింది.
కాగా.. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు మరోసారి ఇవాళ అసెంబ్లీలో ఆశాభంగం ఎదురైంది. స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం అని నిన్న సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈరోజు ఉదయం కోర్ట్ ఆర్డర్ కాపీతో స్పీకర్ ని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటెల రాజేందర్ లను సభలోకి అనుమతించేది లేదని స్పీకర్ మరోసారి తన నిర్ణయాన్ని తెలిపారు. సభలోకి ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వలేదు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్ది. మా అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారని వెల్లడించారు బీజేపీ ఎమ్మెల్యేలు.