జీవితం చాలా నేర్పింది.. కుటుంబాన్ని తలుచుకొని ఎమోషనల్ అయిన ఐశ్వర్య రాజేష్..!!

-

ఐశ్వర్య రాజేష్.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను మీడియాతో పంచుకుంది. ఇటీవల ఒక ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ నా ఎనిమిది సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాను అంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది.

ఊహ తెలిసిన వెంటనే తండ్రిని కోల్పోయాను.. ఆ తర్వాత అన్నయ్యలు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు అంటూ చెప్పుకొచ్చింది. ఇక జీవితం తనకు చాలా పాఠాలు నేర్పించిందని, సినిమాలోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా తను చాలా ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నానని ఐశ్వర్య రాజేష్ తెలిపింది.

ఇకపోతే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడ్డాను.. నా సినిమాను ప్రేక్షకుల మనసులో నిలిచిపోవాలని అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఐశ్వర్య నటించిన కక్కాముట్టై సినిమాతో మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత కనా లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో కూడా మెప్పించింది. ప్రస్తుతం తెలుగు , తమిళ్ భాషలలో సినిమాలు చేస్తూ పూర్తిస్థాయిలో బిజీగా ఉందని చెప్పవచ్చు. ఇక తెలుగు సినీ ఇండస్ట్రీకి వస్తే కౌసల్య కృష్ణమూర్తి తో బాగా పాపులారిటీని సొంతం చేసుకున్న ఈయన చివరిగా నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.

ఇక ఐశ్వర్య రాజేష్ ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ నటుడు రాజేష్ కుమార్ కూతురు.. అంతే కాదు తెలుగులో ఫిమేల్ లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలక్ష్మి మేనకోడలు కూడా.. ఇకపోతే సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ ఈమె ఏ మాత్రం తన బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా సొంత తెలివితోనే ఇండస్ట్రీలోకి పైకి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version