మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘లైగర్’..అప్‌డేట్ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ- టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫిల్మ్ ‘లైగర్’. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ చిత్ర అప్ డేట్ కోసం సినీ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో బుధవారం విజయ్ దేవరకొండ చిత్ర అప్ డేట్ ఇచ్చారు. ఈ నెల 9న సాయంత్రం 4 గంటలకు టీజర్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు.

లైగర్ హంటింగ్ కు బయలుదేరాడని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశాడు రౌడీహీరో.

‘లైగర్’ ..పాన్ ఇండియా ఫిల్మ్ కాగా, ఇందులో విజయ్ కు జోడీగా బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్యా పాండే నటించింది. పూరీ జగన్నాథ్ ఓన్ ప్రొడక్షన్ హౌజ్ పూరీ కనెక్ట్స్, కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘లైగర్’ పిక్చర్ ప్రొడ్యూస్ చేశాయి. పూరీ జగన్నాథ్ తన నెక్స్ట్ మూవీ ‘జనగణమన’ కూడా రౌడీ హీరో విజయ్ దేవరకొండతో చేస్తుండటం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news