ఓటర్ ఐడి తో ఆధార్‌ లింక్… స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు…!

-

ఓటర్ ఐడితో మీ ఆధార్‌ను లింక్ చెయ్యాలని చూస్తున్నారా..? అయితే ఇలా ఈజీగా లింక్ చేసేయచ్చు. మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. ఆధార్ కార్డు అన్నింటికీ ఇప్పుడు అవసరంగా మారింది. ఆధార్ కార్డు లేకపోతే చాలా పనులు ఆగిపోతాయి. అయితే ఓటర్ ఐడితో మీ ఆధార్‌ను లింక్ చెయ్యాలంటే ఇలా ఈజీగా లింక్ చేసేయండి. సులభంగా లింక్ చేయవచ్చు.

ఇక వివరాలలోకి వెళితే.. మెసేజ్ ద్వారా కూడా ఆధార్, ఓటర్ ఐడిని లింక్ చెయ్యడానికి అవుతుంది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 166 లేదా 51969కి మెసేజ్ చెయ్యండి. ECLINK స్పేస్ EPIC నంబర్ స్పేస్ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చెయ్యండి. స్పీడ్ ఇవ్వండి. ఇలా ఈజీగా మెసేజ్ తో లింక్ చేసేయచ్చు. టోల్ ఫ్రీ నంబర్ 1950 కి కాల్ చేసి కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. అలానే ఆఫ్ లైన్ లో కూడా మీరు లింక్ చెయ్యచ్చు. ఆధార్, ఓటర్ ఐడి స్వీయ-ధృవీకరణ కాపీని బూత్‌ లెవల్‌ ఆఫీసర్‌ కి ఇవ్వాల్సి వుంది. ఇలా కూడా లింక్ చేయడం ఈజీ ఏ.

ఆన్ లైన్ లో ఇలా ఈజీగా లింక్ చేసుకోండి:

ఆధార్ కార్డ్‌తో ఓటర్ ఐడిని లింక్ చేయడానికి https://nvsp.in/ కి వెళ్ళండి.
ఇప్పుడు లాగిన్‌ పై క్లిక్ చేయండి.
వినియోగదారుగా నమోదు చేసుకునే ఆప్షన్ వస్తుంది. దాని మీద నొక్కండి.
మొబైల్ నంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది.
ఓటీపీని నమోదు చేసాక కొత్త పేజీ వస్తుంది.
ఇక్కడ అడిగిన వివరాలని ఎంటర్ చేసేసి సబ్మిట్ చెయ్యండి.
రిజిస్ట్రేషన్ అవుతుంది. అన్నీ సబ్మిట్ చేసేస్తే మీకో ఆటోమేటిక్ రసీదు సంఖ్య జనరేట్ చేయబడుతుంది.
ఈ నెంబర్ ద్వారా మీరు స్టేటస్ చెక్ చెయ్యచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version