అన్నదాతలకు గుడ్ న్యూస్. ఇలా లోన్ తీసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని లోన్ ని ఇస్తోంది. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు రైతులకు గుడ్ న్యూస్ ని చెప్పింది. మరిక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే..
అన్నదాతలు సులభంగానే రుణం పొందే అవకాశాన్ని కల్పించింది. పీఎన్‌బీ కిసాన్ తత్కాల్ లోన్ యోజన కింద పంజాబ్ నేషనల్ బ్యాంకు రైతులకి డబ్బులు ఇస్తోంది. రూ. 50 వేల వరకు లోన్ పొందొచ్చు రైతులు. రైతుల రుణ మొత్తం నేరుగా బ్యాంక్ అకౌంట్ లో పడతాయి. ఆర్థిక అవసరాల కోసం బ్యాంక్ లోన్ ని రైతులకి ఇస్తోంది. గరిష్టంగా రూ.50 వేల వరకు లోన్ పొందవచ్చని అన్నారు.
పైగా ఎలాంటి ప్రూఫ్ అక్కర్లేదు. కేవలం కొన్ని డాక్యుమెంట్స్ ఉంటే చాలు. లోన్ ని తీసుకోవాలంటే రైతులుకి వ్యవయసాయ భూమి ఉండాలి. కౌలు రైతులు కూడా ఈ లోన్ ని తీసుకోవచ్చు. గ్రూపులుగా రైతులు ఏర్పడి కూడా ఈ రుణం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ రైతులు గత రెండేళ్లు గా ఏమైనా లోన్ ని తీసుకుంటే లోన్ సరిగ్గా కడుతూ ఉండాలి. రుణ పరిమితిలో 25 శాతం వరకు లేదా గరిష్టంగా రూ. 50 వేల వరకు లోన్ ని పొందొచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి నేరుగా లోన్ తీసుకోవచ్చు.