ఎన్నికల బరిలో ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడు.. ఏ పార్టీ నుంచో తెలుసా..??

-

పంజాబ్ రాజకీయాలలో ప్రస్తుతం ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు లోక్సభ ఎన్నికల బరిలో దిగాడు.. 1984 అక్టోబర్ 31న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డ్స్ బియాంత్ సింగ్ మరియు సత్వంత్ సింగ్ కాల్చి చంపారు.. అప్పట్లో ఈ హత్య రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది.. బాడీగార్డ్స్ ఆమెను హత్య చేయడంపై దేశం అల్లకల్లోలంగా మారింది.. ఇందిరా హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడే ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు..

ఇందిరాగాంధీ ఎంతకుల్లో ఒకరైన బియంత సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ ఖర్శా పంజాబ్ లోని ఫరీద్ కోట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.. ఇతను గతంలో చాలాసార్లు ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఒక్కసారి కూడా గెలవలేదు.. అయితే గెలుపోటములను ప్రభావితం చేసే ఓటు బ్యాంకు ను మాత్రమే షేర్ చేసుకోగలుగుతున్నారు.. 2004లో బటిండా స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.. అలాగే 2007లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బదౌర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. 2014లో కూడా అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు స్వతంత్ర అభ్యర్థిగా అయిన బరిలోకి దిగారు..

సరబ్ జీత్ తల్లి బిమల్ కౌర్, తాత సూచా సింగ్ 1989 ఎన్నికల్లో వరుసుగా రోపర్, బటిందా స్థానాలు నుంచి ఎంపీలుగా గెలిచారు.. అయితే సరబ్ జీత్ మాత్రం ఇంతవరకు ఒక్కసారి కూడా గెలవలేదు.. ప్రస్తుతమైన పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ సాదిక్, బిజెపి తరఫున పంజాబీ సింగర్ హ్యాన్స్ రాజ్ పోటీలో ఉన్నారు.. వీరిద్దరికీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం కూడా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.. ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడైన సరబ్ జీత్ మాత్రం గెలుపోటము లెక్కచేయకుండా ప్రతిసారి ఎన్నికల బరిలో ఉంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version