లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళను చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ.. ఇచ్చిన వాయిదా తీర్మాణంపై చర్చ డిమాండ్ చేశారు. ఈరోజు ఉదయం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు ఎస్సీ వర్గీకరణపై వాయిదా తీర్మాణం ఇచ్చారు. లోక్ సభ ఎస్సీ వర్గీకరణపై చర్చకు అనుమతించకపోడంతో టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ఈ అంశం గురించి మధ్యాహ్నం 12 గంటలకు మీడియాలో మాట్లాడనున్నారు ఎంపీలు.
ఇప్పటికే పలు వాాయిదా తీర్మాణాలు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. బుధవారం కులగణన చేపట్టాలని… లోక్ సభలో నామా నాగేశ్వర్ రావు, రాజ్యసభలో కేశవరావులు వాయిదా తీర్మాణాలు ఇచ్చారు. అయితే సభాపతులు ఇందుకు అనుమతించలేదు. దీంతో వాకౌట్ చేశారు. అంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీపై చర్చించాలని వాయిదా తీర్మాణం ఇచ్చారు. ఆసమయంలో కూడా ఉభయసభలు అనుమతించకపోవడంతో వాకౌట్ చేశారు. తాజాగా ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన వాయిదా తీర్మాణాన్ని అంగీకరించకపోవడంతో మరోసారి సభ నుంచి బయటకు వచ్చారు.