ఏపీ సీఎం జగన్ పై నారా లోకేష్ నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డి ఒక భవనం శంకుస్థాపనకి వస్తున్నాడు అంటే 100 భవనాలు ధ్వంసం చేయిస్తాడసని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఒక మొక్క నాటితే వెయ్యి చెట్లు నేలకూలుస్తాడు. జగన్ నర్సాపురం వెళ్తే.. పరదాలు బారికేడ్లు నిర్బంధంతో అది కాస్తా జనం పాలిట నరకాపురం చేశారని ఆగ్రహించారు నారా లోకేష్.
జగన్ రెడ్డి గారి ప్రచారమేమో ప్రజారోగ్య దేవుడు. వాస్తవమేమో ప్రజల పాలిట యముడు. ఆపదలో వచ్చినవారిని సూదీ దూదిలేని ఆస్పత్రులు వెక్కిరిస్తున్నాయి. నిన్న తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో నడిరోడ్డుపై మహిళ ప్రసవించింది. నేడు కుప్పంలో బాలింత, కవలలలో ఒకరు వైద్యం అందక చనిపోయారు. సాక్షి పత్రిక ఫస్ట్ పేజీలో కోటి రూపాయల ప్రకటనలో కనిపించిన ప్రజారోగ్య దేవుడు యాడా కనిపించడేం? అని ప్రశ్నించారు.
ఫ్యామిలీ ఫిజిషియన్ అంటూ మెజీషియన్ మాయలు చేసేబదులు..ఆస్పత్రిలో వైద్యులుండేలా..వారు వైద్యం అందించేందుకు మందులు, పరికరాలు ముందు ఇవ్వండి. ప్రజారోగ్య దేవుడినని పబ్లిసిటీ చేసుకుంటున్న ముఖ్యమంత్రిని ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలే నమ్మడంలేదు. ఇక ప్రజల ప్రాణాలకు భరోసా ఎలా ? అని నిలదీశారు.