కమలం జోరు..కారుకు బ్రేకులు?

-

తెలంగాణలో కమలం జోరు పెరిగింది..రోజురోజుకూ బీజేపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది..నెక్స్ట్ ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలనే కసి తెలంగాణ బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీని మట్టికరిపించి..తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని తహ తహలాడుతున్నారు. అయితే కేంద్రంలోని పెద్దలు కూడా బీజేపీకి ఫుల్ గా సహకరిస్తున్నారు..ప్రతి విషయంలోనూ సపోర్ట్ గా నిలబడుతున్నారు..అవసరమైతే తెలంగాణకు వచ్చి…ఇంకా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.

కేంద్రంలోని పెద్దలు కూడా వస్తుండటంతో..తెలంగాణలోని బీజేపీ నేతల్లో జోష్ పెరుగుతుంది…ఇంకా కసితో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళుతున్నారు. ఇక ఇటీవల కూడా కేంద్ర పెద్దలు వరుసగా తెలంగాణకు రావడంతో కమలనాథుల జోరు పెరిగింది. ఆ మధ్యే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రాగా, రెండు వారాలకు ముందు హోమ్ మంత్రి అమిత్ షా వచ్చారు. బండి సంజయ్ రెండో దశ పాదయాత్ర ముగింపు సభలో పాల్గొని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు.

ఇక తాజాగా ప్రధాని మోడీ ఎంట్రీ ఇచ్చారు. అనూహ్యంగా కేసీఆర్ కుటుంబంపై మోడీ ఫైర్ అయ్యారు. అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదని,  కేవలం ఒక్క కుటుంబం కోసమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదని, ఇక్కడి ఫ్యామిలీ పాలనంతా అవినీతిమయమే అని చెప్పి మోడీ…కేసీఆర్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు. అయితే మోడీ రాకతో బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది..నెక్స్ట్ తెలంగాణలో అధికారం దక్కించుకోవడం ఖాయమని మోడీ స్ట్రాంగ్ చెప్పడంతో…బీజేపీ శ్రేణులు సైతం అదే దిశగా పనిచేసి..తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు.

అయితే ఇక నుంచి బీజేపీ నేతలు మరింత దూకుడుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి..టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడకక్కడ చెక్ పెట్టడమే లక్ష్యంగా ముందుకెళ్లనున్నారు. బీజేపీ ఇదే ఊపుతో పనిచేసుకుంటూ ముందుకెళితే..టీఆర్ఎస్ పార్టీ కాస్త గడ్డు పరిస్తితులని ఎదురుకోవాల్సి వస్తుందని చెప్పొచ్చు. మరి చూడాలి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఎలా నిలువరిస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news