ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు సన్నద్ధమవుతున్న టీడీపీ

-

తెలుగుదేశం పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుజాతి గర్వించదగ్గ మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలకు సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసంలో నేడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత సమావేశం నిర్వహించారు. ప్రజానాయకుడు, తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో తరతరాలకు ఆయన గుర్తుండిపోయేలా ‘జయహో ఎన్టీఆర్’ అన్న వెబ్ సైట్, ‘శకపురుషుడు’ అనే ప్రత్యేక సంచికతో పాటు ఎన్టీఆర్ శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని చంద్రబాబుకు జనార్ధన్ తెలియచేసారు. రెండు పుస్తకాలను విజయవాడలో విడుదల చేస్తామని, వెబ్ సైట్ మరియు శకపురుషుడు సంచికను హైదరాబాదులో ఏర్పాటు చేసే కార్యక్రమంలో విడుదల చేస్తామని తెలిపారు ఆయన. ఈ రెండింటికీ సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చంద్రబాబుకు తెలియపరిచారు.

POSTERMALL TDP Party Logo sl340 (Wall Poster, 13x19 Inches, Matte Paper,  Multicolor) : Amazon.in: Home & Kitchen

గత ఐదు నెలలుగా ఎన్టీఆర్ శతజయంతి కమిటీ శ్రమిస్తోందని, సినిమా రంగంలోని ప్రముఖులు మరియు రాజకీయరంగంలోని నిష్ణాతుల అభిప్రాయాలను వీడియో/వ్యాస రూపంలో తీసుకోవటం జరిగిందని ఎన్టీఆర్ ఖ్యాతి తరతరాలు నిలిచిపోయేలా వీటిని రూపకల్పన చేస్తున్నామని జనార్ధన్ తెలిపారు. ఈ నేపధ్యం లో చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్టీ రామారావు గారు నటుడుగా, రాజకీయ నాయకుడుగా అనూహ్య విజయాలను సాధించి మార్గదర్శకుడిగా మిగిలాడని కీర్తించారు. అలాంటి నాయకుడిపై జనార్ధన్ సారథ్యంలోని కమిటీ చేస్తున్న కృషి అభినందనీయం అని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news