సీతమ్మపై మధ్యప్రదేశ్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

-

కొంతమంది ప్రజాప్రతినిధులు తాము ఉన్నచోటు.. పరిస్థితులను చూడకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయనాయకులు ఓ ట్రెండ్ గా భావిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఆయన సీతమ్మనే అవమాన పరిచేలా మాట్లాడారు.

సీతాదేవి జీవితం విడాకులు తీసుకున్న వ్యక్తి జీవితంలాంటిదే అని పోల్చారు. రాముడు ఎన్ని కష్టాలు పెట్టినా.. అడవిలో పిల్లలకు జన్మనిచ్చినా.. ఆయన క్షేమాన్నే సీత కోరుకున్నదని చెప్పారు. ఎన్ని బాధలు ఉన్నా రాముడినే లవకుశలు కీర్తించారని చెప్పుకొచ్చారు. ఆమె భూమిలోకి తిరిగి వెళ్లిపోవడాన్ని నేటి కాలంలో ఆత్మహత్యగా అభివర్ణించారు. ఆదివారం సాయంత్రం ఉజ్జయినిలోని నాగ్డాలో జరిగిన కరసేవక్‌ సమ్మాన్‌లో సదరు విద్యామంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం సృష్టించింది. వందేమాతరం గ్రూపు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 94 మంది కరసేవకులను సత్కరించాలని నిర్ణయించారు. అయితే, వీరిలో చాలా మంది ఇప్పటికే చనిపోయారు. చాలా మంది కరసేవకులు తమ భార్య, పిల్లలతో సన్మాన కార్యక్రమానికి వచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news