మద్రాస్‌ హైకోర్టు సంచలనం.. సెక్స్‌ వర్కర్లను అరెస్ట్‌ చేయద్దు..

-

మద్రాస్‌ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు సెక్స్‌ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని సూచించింది మద్రాస్‌ హైకోర్టు. వ్యభిచార గృహంలో ఉన్న విటుడిపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది మద్రాస్‌ హైకోర్టు. వ్యభిచారం కూడా ఒక వృత్తి అని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించింది మద్రాస్‌ హైకోర్టు.

Madras High Court Dismisses DMK's Plea Challenging Postal Ballots Provision  In RP Act

వ్యభిచార గృహం నడపడమే చట్టవిరుద్ధమని గుర్తు చేసింది మద్రాస్‌ హైకోర్టు. దాడి సమయంలో వ్యభిచార గృహంలో ఉన్నాడని విటుడిని అరెస్టు చేయడం సరికాదని స్పష్టం చేసింది మద్రాస్‌ హైకోర్టు. అయితే.. గతంలో సుప్రీంకోర్టు వ్యభిచారం నేరం కాదని ఇచ్చిన తీర్పుపై విభిన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో మద్రాస్‌ హైకోర్టు కోర్టు ఇచ్చిన ఆదేశాలు మరోసారి ఉత్కంఠ రేపుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news