సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్న ఘట్టమనేని రమేష్ బాబు నిన్న అనారోగ్యంతో… మరణించిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్ బాబు శనివారం సాయంత్రం తవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆయనను గచ్చి బౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
కానీ ఆస్పత్రికి చేరగానే ఆయన మరణించారు. దీం తో ఆయన కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్లారు. ఇక రమేష్ బాబు అంత్యక్రియలు… ఇవాళ జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. అన్న రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు దూరం కానున్నట్లు సమాచారం అందుతోంది. మహేష్ బాబు కు రెండు రోజుల కిందట అంటే.. జనవరి 7 న కరోనా సోకింది. ప్రస్తుతం మహేష్ బాబు హోం క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా కారణంగా అన్న రమేష్ బాబు అంత్యక్రియలకు మహేష్ బాబు దూరం కానున్నట్లు తెలుస్తుంది.