క్రేజీ న్యూస్ : యాంకర్‌గా మహేశ్ బాబు.. రాజమౌళి, చరణ్, తారక్‌లతో చిట్ చాట్!

-

ప్రజెంట్ ప్రపంచమంతా కూడా ‘ఆర్ఆర్ఆర్’ మేనియాలో ఉంది. ఎక్కడ చూసినా ఈ చిత్రం గురించిన చర్చనే జరుగుతున్నది. ఈ నెల 25న ఫిల్మ్ రిలీజ్ అవుతుండగా, దానిని చూసేందుకు అభిమానులు, సినీ ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ఆకాశమే హద్దుగా సాగుతున్నాయని చెప్పొచ్చు.

మూవీ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు వెళ్లి సినిమా గురించి విస్తృతంగా ప్రమోట్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో మీడియాతో ముచ్చిటిస్తూ స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. కాగా, నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వార్త ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తర్వాత మెగా ఇంటర్వ్యూ ఉండబోతున్నదని తెలుస్తోంది.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ డైరెక్టర్ రాజమౌళి, హీరోలు తారక్, చెర్రీలను ఇంటర్వ్యూ చేస్తారని సమాచారం. అయితే, ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా రాలేదు. కానీ, ఒకవేళ అదే కనుక జరిగితే ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు సూపర్ స్టార్స్‌ను చూసే అదృష్టం దక్కుతుందని అభిమానులు ఆనందపడిపోతున్నారు. ఇకపోతే రాజమౌళి తన నెక్స్ట్ ఫిల్మ్ మహేశ్ బాబుతో చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన స్టోరి డిస్కషన్స్, థాట్స్ ఇప్పటికే చేసినట్లు జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ క్రమంలోనే మహేశ్ ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ మూవీ యూనిట్ సభ్యులను ఇంటర్వ్యూ చేస్తే కనుక అది నెక్స్ట్ లెవల్ ప్రమోషనే అవుతుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version