ఏ హీరో అయినా సరే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తే మంచి ఫేమ్ రావడమే కాకుండా భారీ స్థాయిలో పారితోషకం కూడా ఉంటుంది. అయితే రాజమౌళితో సినిమా అంటే కొంచెం ఓపిక ఉండాలి. ఎందుకంటే ఆయన సినిమాలు సుమారుగా రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుంది.. ఇక అప్పటివరకు జక్కన్న సినిమా పైన ఆధారపడక తప్పదు. కానీ కొంచెం ఓపికతో ఉంటే మాత్రం దేశం గర్వించదగ్గర నటుడు అవుతారనడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలు ఆల్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.
ఇకపోతే ఈ క్రమంలోని ప్రిన్స్ మహేష్ బాబు కూడా సూపర్ స్టార్ హీరోగా మారిన తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మొదటిసారి ఒక సినిమా చేయబోతున్నాడు. నిజానికి పరుశురాం డైరెక్షన్లో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాను కేవలం 65 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరక్కెక్కించి ఏకంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లు కాబట్టి సెన్సేషన్ రికార్డు సృష్టించాడు మహేష్ బాబు. ఇప్పటికే రూ.100 కోట్ల పారితోషికం తీసుకుంటున్న హీరోలు కూడా వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు చిత్రీకరిస్తున్నా పెట్టుబడి కూడా సాధించలేకపోతూ ఉండడం..అలాంటి సమయంలోనే మహేష్ బాబు ఇలాంటి రికార్డులు సృష్టించడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక ఈ క్రమంలోనే మహేష్ బాబు.. రాజమౌళి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక రాజమౌళి కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి సరికొత్త విజువల్ ఎఫెక్ట్స్ ని ఈ సినిమాలో వాడబోతున్నారట. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక ఆల్ మోస్ట్ స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. ఫైనల్ టచ్ మాత్రమే మిగిలి ఉంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి తన కెరీర్ లోనే అత్యధిక పారితోషికం తీసుకోబోతున్నారని సమాచారం. ఏకంగా ఆయన రాజమౌళి సినిమా కోసం రూ.80 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. ఇక ఇదే నిజమైతే మహేష్ రేంజ్ పాన్ ఇండియా లెవెల్ లో మారు మ్రోగిపోతుందని చెప్పడంలో సందేహం లేదు.