శ్రీరెడ్డి తనదైన స్టైల్, తనదైన మాటలతో యువతకు కిక్కెస్తుంది. తనకు నచ్చినట్టు ఉండటమే తనకు ఇష్టం అనడమే కాదు అలాగే ఉంటుంది కూడా.. కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ ఇండస్ట్రీలో జరిగే ముసుగు వ్యవహారాలపై పోరాటం చేసింది. తరువాత ఆమెను పక్కదారి పట్టించడంతో తన పని తాను చేసుకుంటుంది. తెలుగులో తనకు సినిమా అవకాశాలు ఇవ్వరంటూ మకాం చెన్నైకి మార్చేసింది.
అంతేనా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులతో కబుర్లు చెబుతూ కనువిందు చేస్తుంది. రాజకీయం, సినిమా టాపిక్ ఏదైనా తన స్టైల్‌లోనే జవాబిస్తుంది.. ప్రశ్నిస్తుంది… తిట్టి పోస్తుంది. తను సొంతంగా శ్రీరెడ్డి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి హోం టూర్, బెడ్ రూమ్ టూర్ లతోపాటు వంటలు చేస్తూ అందాలను కొసరుగా వడ్డిస్తుంది.
ఏది చేసినా తన ఇస్టైల్ మాత్రం వదల్లేదు.. అందుకే ఆమె అభిమానులు ఆమె వీడియోలకోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూఉంటారు. వంటలు నేర్పిస్తూ పల్లెటూరి చీరకట్టులో అందాలను వడ్డిస్తే ఆ వీడియోలు ఎంతగా వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత సినిమాల్లోని జయమాలినీ, జ్యోతి లక్ష్మిలు గుర్తుకు వస్తారు మరి.,
ఇక టైటిల్స్… అయితే ఆ రేంజే వేరు.. “నా పనస కాయల కూర తింటారా??” “నేను వండిన సొర చేప తింటే | మంచం ఇరిగి పోవాలంతే” .. ఇలా యువత మతులు పోగెట్టేలా ఉంటాయి వీడియో, మాటల బాణాలు, టైటిళ్ళు.. తాజాగా శ్రీరెడ్డి మటన్ తిల్లి కూర గోదావరి స్టైల్లో వండివార్చింది. ఇది తింటే తల్లి అయిపోవడం ఖాయమట. ఈ మటన్ తిల్లి కూర గుండె జబ్బులు ఉన్నవాళ్ళకు, బాలింతలకు, పిల్లలకు మంచిదట. వంటకం చూస్తే మాత్రం నిజంగానే నోరూరిపోతుందనుకోండి.. మీరు ఒక లుక్కేయండి..