మీ గూగుల్ అకౌంట్ లో ఈ మార్పులు చెయ్యండి.. లేదంటే చిక్కులే..!

-

గూగుల్ మనకు ఎన్నో రకాల సేవలను ఇస్తోంది. జీమెయిల్, మ్యాప్స్, డ్రైవ్, ఫొటోస్ ఇలా ఎన్నో. అయితే ఈ సేవలను మనం పొందాలంటే కొంత వ్యక్తిగత సమాచారాన్ని మనం గూగుల్ కి ఇవ్వాల్సి ఉంటుంది. మన పేరు, ప్రొఫైల్ ఫోటో, మెయిల్ ఐడి, పుట్టిన తేదీ ఇలాంటి వివరాలను గూగుల్ సేవలను ఉపయోగించడానికి మనం ఎంటర్ చేయాలి.

అయితే మీరు ప్రైవసీకి ప్రాధాన్యతనిస్తూ ఈ వివరాలలో మార్పులు చేయడంతో పాటు వాటిని ఇతరులు చూడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మరి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.

మీరు కనుక మీ డీటెయిల్స్ ని ఇతరులు చూడకుండా ఉండాలంటే మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో

  • గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి కుడి వైపు ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయండి.
  • అక్కడ మీకు బ్రౌజర్ సెట్టింగ్స్ కనపడతాయి.
  • దాని మీద క్లిక్ చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
  • దానిని మీరు ఓపెన్ చేయగానే గూగుల్ ఖాతా పేజ్ ఓపెన్ అవుతుంది.
  • పర్సనల్ ఇన్ఫో మీద క్లిక్ చేసి.. Choose what others see అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి.
  • అక్కడ మీకు అబౌట్ అని కనపడుతుంది.
  • దాని మీద క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి.
  • వీటి ఆధారంగా మీరు ఎవరు చూడొచ్చు అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
  • ఇతరులు ఆ సమాచారంని చూడకూడదు అనుకుంటే ఓన్లీ మీ అనే దాని మీద క్లిక్ చేయండి.
  • ఇలా చేయడం వల్ల ఇతరులు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూడకుండా ఉండడానికి అవుతుంది.
  • ఇలా గూగుల్ అకౌంట్ లో మీరు మార్పులు చేసుకోవచ్చు.
  • దీనితో మీరు ఇతరులు చూడకూడదు అనే సమాచారాన్ని ఇతరులు చూడకుండా ఉంచడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version