2019 లోక్ సభ ఎన్నికల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలతో గెలిపిస్తే, ఆయన చేసిందేమీ లేదని మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై ఉన్న ఆదరణ చూస్తుంటే ఎన్నికల్లో తన విజయం ఖాయమని అర్థమవుతోందన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు.
కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించండని అభ్యర్థించారు. గత ప్రభుత్వాలు తాగు, సాగునీరు ఇవ్వలేకపోయాయని, కానీ బీఆర్ఎస్ వచ్చాక ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నామన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇంటింటికి నీరు అందించామన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. గత ప్రభుత్వాల కంటే బీఆర్‌ఎస్ ప్రభుత్వమే మారుమూల గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించిందని గుర్తు చేశారు. అభివృద్ధి నిరోదకులను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రజలు తాగునీరు, సాగునీటికి అనేక ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటింటికి నీరు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కార్యక్రమంలో మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్‌గౌడ్, కార్పొరేటర్లు, నాయకులు, పార్టీశ్రేణులు పాల్గొన్నారు.