నేనే మల్లన్నను అంటూ బర్రెలకు మేత వేసిన మల్లారెడ్డి

-

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలుత టీడీపీ నుంచి మల్కాజ్ గిరి ఎంపీగా విజయం సాధించిన మల్లారెడ్డి.. ఆ తరువాత బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక శాఖ మంత్రి అయ్యారు. మంత్రిగా మల్లారెడ్డి కార్మికుడిని అంటూ అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే.

తాజాగా ఎన్నికల ప్రచారాన్ని వినూతనంగా నిర్వహించారు. మల్లారెడ్డి వీడియో సోషల్ మీడియాలో సైతం వైరల్ అయింది. మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  ప్రచారంలో భాగంగా ఓ రైతు పశువుల పాక వద్దకు వెళ్లి.. బర్రెకు గడ్డి పెడతూ..నేనే మల్లన్నను మీకు ఇంతకు ముందు సేవ చేశాను.. అంటూ పాత రోజులను గుర్తుకు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news