2024ఎన్నికల నేపథ్యంలో మోదీని ఢీకొట్టేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పావుల్ని కదుపుతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. బెంగాల్ లో గెలిచినప్పటి నుండి మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న రాజకీయ నాయకురాలిగా మమతా బెనర్జీ ఒక్కరే కనిపించడం కూడా ఈ వ్యూహాలకు బలాన్నిస్తున్నాయని వినికిడి. నిజానికి మోదీని ఢీకొట్టే రాజకీయ నాయకులు ఎవరూ కనిపించడం లేదు. జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీపై చాలామందికి నమ్మకం లేదు.
అందువల్ల ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉన్నవారే మోదీని ఢీకొట్టే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. ఆ విధంగా మమతా బెనర్జీ పేరు ముందు వరుసలోకి వచ్చారు. ఐతే అటు మమతా కూడా 2024ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కునేందుకు సర్వశక్తులు, చతురంగ బలాలు సిద్ధం చేసుకుంటున్నారు. విపక్షాలను కూడగట్టేందుకు సమావేశాలు నిర్వహించనున్నారు. అందులో భాగంగా సోనియా గాంధీతో మాటామంతీ జరపనున్నారు. ఈరోజు సాయంత్రం 4:30గంటలకు సోనియా గాంధీతో మమతా బెనర్జీ మీటింగ్ జరపనుంది. మరి ఈ సమావేశం సక్సెస్ అయ్యి మోదీని ఢీకొట్టాలనే మమత ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.