ప్రయాణికుడి పొట్టలో కిలో బంగారం.. ఎక్స్​రేలో బయటపడ్డ క్యాప్సుల్స్​

-

విదేశాల నుంచి అక్రమంగా బంగారం, కరెన్సీ, గంజాయి, డ్రగ్స్.. ఇతర సామగ్రి తరలించేటప్పుడు అధికారులకు పట్టుబడకుండా కొందరు కేడీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో టిప్స్​ కోసం సినిమాల నుంచి ప్రేరణ పొందుతుంటారు. అలా తమిళ హీరో సూర్య నటించిన వీడొక్కడే సినిమాను ఆదర్శంగా తీసుకుని ఓ వ్యక్తి అక్రమంగా బంగారం తరలించాడు. ఏకంగా పొట్టలో కిలో బంగారం దాచి మరీ అధికారులకు పట్టుబడకుండా ట్రై చేశాడు. కానీ అధికారులకు చిక్కి కటకటాలపాలయ్యాడు.

మలప్పురం జిల్లా వరియంకోడ్​కు చెందిన నౌఫల్​(36) అనే వ్యక్తి దుబాయ్ నుంచి కొజీకోడ్​కు వచ్చాడు. 1.063 కేజీల బంగారాన్ని 4 క్యాప్సూల్స్‌గా మార్చి కడుపులో పెట్టుకున్నాడు. పోలీసులు అతడిని తనిఖీ చేసినా బంగారాన్ని కనిపెట్టలేకపోయారు. అయినా అనుమానం వచ్చిన అధికారులు.. నిందితుడు నౌఫల్‌ను కొండొట్టిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అతడికి ఎక్స్‌రే తీయగాా కడుపులో ఉన్న నాలుగు బంగారు క్యాప్సూల్స్ బయటపడ్డాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version