మండూస్‌ తుఫాను ఎఫెక్ట్‌.. చైన్నైలో భారీ వర్షాలు

-

సముద్రం అల్లకల్లోలమవుతోంది. మండూస్‌ తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడి తీరం వైపు దూసుకొస్తున్న తీర ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో ఈదురు గాలులు జల్లులు మొదలయ్యాయి. పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో గత కొన్ని గంటల నుంచి ఎడతెరపి లేకుండా సాధారణ వర్షం పడుతున్నది. మండూస్‌ తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే గ్రేటర్‌ చెన్నై కార్పోరేషన్‌ కమిషనర్‌ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని పార్కులు, ప్లే గ్రౌండ్‌లను మూసివేయించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా చెన్నై ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలను కూడా నిలిపివేశారు.

అయితే.. బంగాళాఖాతంలో ‘మాండూస్’ తీవ్ర తుపాను బలహీనపడింది. తీవ్రత తగ్గినప్పటికీ ‘మాండూస్’ ఇంకా తుపాను స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు కారైక్కాల్, చెన్నైలోని డాప్లర్ వెదర్ రాడార్లతో పరిశీలిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news