కమల్ హాసన్ గుర్తింపుతో కమెడియన్ “మనోబాల” కెరీర్ పీక్స్ కు !

-

తమిళ స్టార్ కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్న మనోబాల కాసేపటి క్రితమే చెన్నై లోని ప్రముఖ హాస్పిటల్ లో లివర్ సమస్యకు చికిత్స తీసుకుంటూ మరణించారు. దీనితో తమిళ సినిమా ఇండస్ట్రీ అంతా విషాదంలో మునిగింది, కాగా ఈయన తన సినీ కెరీర్ ను 1970 లోనే స్టార్ట్ చేసినా, 1979 సంవత్సరం నుండి తన క్రేజ్ అలా పెరిగిపోయింది. విశ్వనటుడు కమల హాసన్ ఈయన నటనను గుర్తించి 1979 లో తాను నటించిన “పుతియా వార్పుగల్” అనే సినిమాలో అవకాశం ఇప్పించాడు. ఈ సినిమాను భారతీరాజా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆయన పాత్రకు బాగా మైలేజ్ వచ్చింది.

దానితో ఇక తిరిగిస్చుసుకునే అవసరం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయాడు. ముఖ్యంగా ఈయన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో కూడా డబ్ కావడంతో అక్కడి ప్రేక్షకుల మనసుకు దగ్గరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news